
యాదాద్రిభువనగిరి జిల్లాలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే థర్డ్‌వేవ్ ప్రారంభం కాగా జిల్లాలోనూ కొత్త కేసుల ప్రభావం కనిపిస్తోంది. యాదగిరిగుట్ట మండలంలో సోమవారం నలుగురికి కరోనా పాజిటివ్ నమోదు అయింది. రామన్నపేట మండలంలో మరో ఐదుగురికి పాజిటివ్ నమోదయినట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.