బ్రేకింగ్ : రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

-

కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు ఇప్పటికే ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఒక పక్క కరోనా వ్యాక్సిన్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆనంద పడాలో లేక కొత్త కరోనా వేరియంట్స్ బయట పడుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో కేవలం సామాన్యులకు మాత్రమే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా సోకేవి. కానీ ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా భారీ ఎత్తున కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా తనకు కరోనా సోకిందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కొద్దిసేపటి క్రితం ప్రకటించాడు. నాకు కరోనా సోకింది కానీ నాకు ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు అందుకే ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. త్వరలోనే ఈ వైరస్ నుండి కోలుకుని బయటకు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అలానే తనను రెండు రోజుల నుంచి కలిసిన వారందరినీ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రామ్ చరణ్ కోరాడు. ఇక రామ్ చరణ్ తేజకు కరోనా సోకింది అన్న విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news