కరోనా వైరస్ పరిక్షలు ఎంత వేగంగా జరిగితే అంత మంచిది. ఇప్పుడు ప్రపంచానికి చాలా వరకు కూడా ఇదే అవసరం. కరోనా కట్టడిలో పరిక్షల వేగమే కీలక పాత్ర పోషిస్తుంది. 24 గంటల్లో లేదా రెండు రోజుల్లో కరోనా ఫలితం వస్తే ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే చాలా మంది కరోనా పరీక్షలను వేగంగా జరగాలి అని కోరుతున్నారు. అందుకే అరగంట లో లేదా 20 నిమిషాల్లో ఫలితం వచ్చే విధంగా ఇప్పుడు పరిజ్ఞానం అభివృద్ధి చేస్తున్నారు.
తాజాగా సింగపూర్ కి చెందిన శాస్త్రవేత్తలు, కరోనా పరీక్షలను వేగంగా చేసే పరికరాన్ని తయారు చేసారు. కరోనా పరీక్షను 36 నిమిషాల్లోనే పూర్తి చేయగల పద్ధతిని సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఇప్పుడు ఉన్న పరిక్షల కంటే చాలా వేగంగా పని చేస్తుంది అని, నాలుగు రెట్లు వేగం అని దీన్ని తయారు చేసిన నాన్యాంగ్ టెక్నాలజికల్ వర్సిటీకి చెందిన లీ కాంగ్ చియాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు చెప్పారు. లక్షణాలు ఉన్న వ్యక్తి రక్త నమూనాను పరీక్షించి వేగంగా ఫలితం ఇస్తుంది.