హిమాచాల్ ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 27 మధ్య కోవిడ్ -19, క్షయ, కుష్టు, చక్కెర, అధిక రక్తపోటు ఉన్న రోగులను గుర్తించడానికి ఇంటింటికీ సర్వే నిర్వహించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇద్దరు సభ్యులు ఉన్న బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 800 టీంలను ఏర్పాటు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో శనివారం 915 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం ఇన్‌ఫెక్షన్లు 33,701 కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 18 మంది కొత్తగా మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 510 కు పెరిగింది. సిమ్లాలో ఎనిమిది మంది మరణించారు. ఈ రాష్ట్రానికి కేంద్రం తన బృందాలను పంపిస్తుంది.