గత వారం నుంచి దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు చర్చలకు నాయకత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లను ఈ ఉదయం బిజెపి చీఫ్ జెపి నడ్డా ఇంట్లో భేటీ అవుతారని జాతీయ మీడియా వర్గాలు చెప్పాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య 48 గంటల వ్యవధిలో బిజెపి అగ్ర నేతల మధ్య జరిగిన రెండవ సమావేశం ఇది.
కొత్త వ్యవసాయ చట్టాల గురించి ఈ రోజు రైతులకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై పుకార్లను తొలగిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. చట్టాలు రద్దు చేసే అవకాశం లేదని నిరసన కారులకు చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు.