నేడు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరు లేకుండానే అధికారులు కేవలం అర్చకులు సమక్షంలో మాత్రమే బోనాల వేడుకలను జరుపుతున్నారు. ఇలా చేయడం మొట్టమొదటిసారని ఆలయ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు వారి ఇళ్లలోనే బోనాలను సమర్పించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో లష్కర్ ప్రాంతంలో ఈ రోజు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని పివి అంజన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు హైదరాబాద్ నార్త్ జోన్ లో ఉన్న తిరుమలగిరి, బేగంపేట్, మహంకాళి, మార్కెట్, లాలగూడా, గోపాలపురం, చిలకలగూడ, వంటి జోన్ పరిధిలో ఉండే అన్ని మద్యం దుకాణాలు కూడా పోలీసులు ముపేయించారు అధికారులు.
మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని పోలీసులు మద్యం దుకాణాల దారులకు గట్టి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఉత్సవాలలో ఎవరికీ ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ముందుగా భక్తులను అనుమతించకుండ కేవలం అర్చకులు సమక్షంలోనే అమ్మవారికి పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. ఇకపోతే జిహెచ్ఎంసి పరిధిలో కరోనా కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని నిర్మూలనకోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.