భారత్ లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 67 వేల కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,151 మందికి కొత్తగా కరోనా సోకగా..1,059 మంది మ‌ర‌ణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

corona

దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 32,34,475కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 59,449కి పెరిగింది. ప్రస్తుతం 7,07,267 మంది కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,67,759కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news