కలం చాటున కల్మషం చిమ్మే.. పాత్రికేయుడు ఆర్కే! అంటున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు. తాజాగా ఆర్కే వారి పత్రికలో `తెలంగాణను దాటేసిన ఏపీ` అంటూ ఓకథనం అచ్చోశారు. ఏంటాని చూస్తే.. కరోనా కేసుల్లో తెలంగాణలో పాజిటివ్ కేసుల కంటే కూడా ఏపీలో వారం తిరిగే లోపే.. కేసులు పెరిగిపోయాయని వార్తను చాటిలాగే దులిపేశారు.
మొత్తానికి ఈ వార్తను చదివిన వైఎస్సార్ సీపీ నాయకులు చాలా రోజుల తర్వాత తెలంగాణతో ఏపీ ని పోలుస్తూ.. ఆర్కే కుమ్మేశాడు! అంటూ వ్యాఖ్యానించుకుని,.. తామేదో తప్పు చేసేస్తున్నామని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవడం ఖాయమని, సీఎం జగన్‌పై ప్రజలు పెదవి విరవడం గ్యారెంటీ అని అనుకుంటారని ఆర్కే భావించి ఉంటారుఏపీ సీఎం లా జాగ్రత్తగా రాసుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జగన్ అలివిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఎప్పజగన్‌పై ఏదో ఒక రూపంలో దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్న నేతకాని నేత… అయితే, ఇక్కడే ఆయన వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన కరోనా పాజిటివిటీని లెక్కగట్టారు. తెలంగాణలో వారం కిందట 12.5 ఉన్న పాజిటివిటీ రాను రాను తగ్గి ఇప్పుడు 9కి చేరిందని పేర్కొన్నారు.
అదే సమయంలో వారం కిందట ఏపీలో 9 ఉన్న పాజిటివిటీ.. ఇప్పుడు 13కు చేరిందని అచ్చోశారు. అంటే.. తెలంగాణ కంటే కూడా ఏపీ వెనుకబడిపోయిందని, ప్రబుత్వం ఏమీ చేయలేక పోతోందని, కరోనా బాధితులను రోడ్డునపడేశిందని పోల్చే లెక్కలు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఈ పోలిక ఇప్పుడే ఎందుకు ఆర్కే వారికి గుర్తుకు వచ్చిందో అర్ధం కాని విషయం. ఎందుకంటే.. కరోనా టెస్టుల్లో తెలంగాణ కంటే.. ఆ మాటకొస్తే.. దేశం కంటే కూడా ఏపీ ముందుంది. ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు.. వలంటీర్లు ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కానీ, ఈ పరిస్థితి తెలంగాణలో లేదుకదా? అక్కడ కరోనా పరీక్షలను దాదాపు నిలిపివేశారు కదా! అంతేకాదు.. ఇక్కడ మాదిరిగా కరోనా రోగులకు రెండు వేల రూపాయలు ఇవ్వడం లేదు. ప్రైవేటులోనూ ఆస్పత్రులను తీసుకుని నిర్వహించడంలేదు. మరి ఆయా కీలకమైన విషయాల్లోనూ తెలంగాణతో ఏపీని పోల్చి ఉంటే.. ఆర్కే నిబద్ధత అందరికీ తెలిసేది. కానీ, ఇలా దగుల్బాజీ పోలిక పెట్టి.. ఏపీని దుమ్మెత్తిపోయాలను కోవడమే.. విమర్శలకు దారితీస్తోంది.