కరివేపాకు టీ తాగితే అద్భుత ప్రయోజనాలు

-

సాధారణంగా కరివేపాకులను కూరలల్లో తాలింపులుగా ఉపయోగిస్తుంటారు. కరివేపాకులో ఎన్నో ఔషధాలు నిండి ఉన్నాయి. జట్టు రాలే సమస్యలు ఉన్నవారు రోజుకి నాలుగు కరివేపాకులు తిన్నా.. సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది ప్రస్తుతం ఈ టీనే తాగుతున్నారు. కరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగడం వల్ల ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని వారు సూచిస్తున్నారు. అయితే కరివేపాకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

curry leaves tea
curry leaves tea

కరివేపాకు టీ తాగడం వల్ల కడుపులోని సమస్యలన్నీ పరారవుతాయి. తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుంది. మూత్రాశయం బాగా పనిచేస్తుంది. పొట్టలో గ్యాస్, మూత్ర విరేచనాల సమస్య నయమవుతుంది. కరివేపాకుల్లో తేలికపాటి భేదిమందు లక్షణాలు, జీర్ణ ఎంజైములు ఉంటాయి. ఇవి మీ ప్రేగు కదలికను మెరుగుపరుస్తాయి.. తద్వారా జీర్ణక్రియ వేగవంతంగా పనిచేస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారు.. షుగర్ ఫ్రీ టీనే తాగాలని అనుకునేవారికి కరివేపాకు టీ మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. ఇది మీ షుగర్ లెవెల్స్‌ను పెంచుకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. గర్భిణులకు కరివేపాకు టీ బాగా ఉపయోగపడుతుంది. నీరసం, వికారం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. దీంతోపాటు విరోచనాల వల్ల కలిగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది.

కరివేపాకులో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనొలిక్స్ చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ-ర్యాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటుగా చర్మంపై మంట, ఇన్‌ఫెక్షన్స్ లాంటివి రాకుండా కరివేపాకు టీ సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే అరోమా.. నరాలను రిలాక్స్ చేసి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి రోజంతా పని చేసి అలసిపోయిన వారు కచ్చితంగా కరివేపాకు టీ తాగడం వల్ల టెన్షన్, ఒత్తిడి రెండూ తగ్గిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news