ప్రపంచ వ్యాప్తంగా జంతువులకు కరోనా పరిక్షలు జరుగుతున్నాయి. అమెరికాలో ఉండే ఒక జూ లో పులికి సింహానికి ఆ తర్వాత పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్ రావడంతో జనావాసాల్లో తిరిగే వీధి కుక్కలకు కరోనా పరిక్షలు చేస్తున్నారు. కొన్ని జంతువులు ఇప్పుడు ఎందుకు చనిపోతున్నాయో ఎవరికి అర్ధం కావడం లేదు. దీనితో ఇప్పుడు ప్రజలు ఏదైనా జంతువు చనిపోతే భయపడుతునారు.
జోగుళాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. దీనితో వాటికి కరోనా వచ్చిందో ఏం పాడో అని గ్రామ సర్పంచ్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగిన అధికారులు బృందం గ్రామంలోని కుక్కల నుంచి నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించి వాటికి కరోనా రాలేదు అని గుర్తించారు.
గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింత రోగాలు వచ్చాయని వాటికి కరోనా లేదు ఏమీ లేదు అనవసరంగా భయపడవద్దు అని అధికారులు సూచించారు. పరిక్షలు చేసిన కుక్కలకు రోగ నిరోధక టీకాలు వేశామని అధికారులు పేర్కొన్నారు. కుక్కలకు కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదని వాటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని అనవసర ప్రచారం నమ్మవద్దు అని కోరుతున్నారు.