కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఎవ్వరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా శాస్త్రవేత్తలు నిద్రాహారాలు పక్కన పెట్టి నిరంతరంగా పని చేస్తున్నా ఈ మహమ్మారికి చెక్ పెట్టలేకపోతున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎవ్వరూ సరైన కునుకు తీయలేకపోతున్నారు. దీని స్పీడుకు హద్దు అదుపు లేకుండా పోతుంది. తాజాగా ఈ మహమ్మారి ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. కోటి కేసుల మార్క్ ను దాటేసింది పైగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతీ నిమిషానికి 100 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన 10000453 మంది పడినట్టు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో 54 లక్షల మంది కోలుకోగా మరో నలబై లక్షల మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో ఐదున్నర లక్షల మార్క్ కు సమీపం లో ఉన్నట్టు సమాచారం. మరణాల లిస్ట్ లో భారత్ టాప్ 4 ఉన్నట్టు తాజా రిపోర్టులు వెల్లడించాయి. ప్రభుత్వాలతో పాటే ప్రతీ ఊక్కరు సరైన నిబంధనలు పాటించాలని నిపుణుల ఉద్దేశం.
కరోనా మహమ్మారి సరికొత్త రికార్డ్..! కోటి మార్క్ క్రాస్ చేసిన కరోనా..!
-