కరోనా సోకలేదంటున్న స్టార్ యాంకర్..!

-

క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త రెండున్నర నెల‌లుగా సినీ ఇండ‌స్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్‌ లు జ‌ర‌గ‌లేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు హరిక్రిష్ణ, ప్రభాకర్‌‌లకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్‌లో పాల్గొన్న మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు బెంబేతెల్తిపోతున్నారు.

ఈ తరుణంలో ప్ర‌ముఖ యాంక‌ర్‌, ద‌ర్శ‌కుడు ఓంకార్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు సోషల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఓంకార్‌కు కోవిడ్-19 సోకిందనే వార్తలో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ఓంకార్ కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా పరీక్షను ఓంకార్ చేయించుకున్నార‌ని, రిపోర్ట్ నెగ‌టీవ్ వ‌చ్చింద‌ని స్పష్టం చేశారు. దీంతో సోమవారం నుండి ఆయన షూటింగ్ లో సైతం పాల్గొంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news