గుడ్ న్యూస్ : ఫిబ్రవరి కల్లా ఇండియాలో కరోనా ఖతం

-

వచ్చే ఏడాది ఫిబ్రవరికి కరోనా వైరస్ కనుమరుగు కానుందా ? అంటే అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వ కమిటీ. భారతదేశంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి “కరోనా” కనుమరుగు కానుందని భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృత దశను దాటిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ స్పష్టం చేసింది. అయితే కోవిడ్‌-19 నియంత్రణకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది కమిటీ.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్‌ కముమరుగయ్యే నాటికి, దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది. ఇక రానున్న శీతాకాలంలో భారత్‌లో రెండోవిడత కరోనా వైరస్‌ కేసుల ఉధృతి పెరిగే అవకాశం లేకపోలేదని కూడా కొందరు అంటున్నారు. అయితే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే, దాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని వనరులూ సిద్ధంగా ఉన్నాయని మాత్రం కమిటీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news