కరోనా” ఇప్పుడు ఈ పేరు చెప్తే చాలు ప్రపంచం భయపడుతుంది. ఎబోలా, స్వైన్ ఫ్లూ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని భయపెట్టాయో ఇప్పుడు అదే విధంగా ఈ వైరస్ భయపెడుతుంది. చైనాలో పుట్టి జపాన్, అమెరికా, సౌదీ అరేబియా ఈ వ్యాధి కేసులు భయపెట్టాయి. దీనితో విమానాశ్రయాల్లో ఒకరకంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కేరళ కి చెందిన 30 మందికి ఈ వైరస్ వచ్చింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
మన దేశానికి కూడా ఇది సోకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇది సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. చివరికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని ప్రభావం ఉండవచ్చు అని అంటున్నారు కొందరు. దీనితో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. విమానాశ్రయాల దగ్గర అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. హాంగ్ కాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను టెస్ట్ చేసేందుకు ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా హాంగ్‌కాంగ్ నుంచి హైదరాబాద్‌కు విమానాలు తిరగలేదు. గురువారం అర్ధరాత్రి మాత్రం ఓ విమానం వచ్చింది. అందులో ప్రయాణికులకు అన్ని పరిక్షలు చేసి బయటకు అనుమతించారు అధికారులు.