ఏపీ రాజధాని అమరావతి విషయంలో తలెత్తిన సంక్షోభం రోజు రోజుకు ముందురుతున్న విషయం తెలి సిందే. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తూ.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రా ష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ.. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించి పట్టుమని వారం కూడా గడవకముందుగానే రాష్ట్రంలో అనూహ్యమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతం ధర్నాలు, నిరసనలతో అట్టుడుకుతోంది. దీంతో అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. ఈ తరహా ధర్నాలు రైతులు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అనేది కూడా కీలకమైన చర్చ గా నడుస్తోంది.
సరే! ఈ వాదన పక్కన పెడితే.. బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని, మూడు రాజధానుల నిర్మాణానికి కేంద్రం అం గీకరించే పరిస్థితి లేదని, భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుందని, దీని వల్ల ప్రజాధనం వృ ధా అవు తుందని, రాజధాని మార్పుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చా రు. అయితే, ఈ వ్యాఖ్యల వెనుక నిజం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం జోక్యం చేసుకునే వెసులుబాటు ఉంటుందా? అనేది కీలకమైన విషయం. రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాలకు కొన్ని పూర్తి స్థాయి హక్కులు ఉంటాయి.
ఏ రాష్ట్రమైనా తమ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని కేబినెట్‌లో చర్చించి, ఆమోదించి, దానిని సభలో రెండింట మూడొంతుల మెజారిటీతో ఆమోదింపజేసుకుని గవర్నర్ సంతకం పొందితే.. దీనికి తి రుగు ఉండదు. ఈ విషయంలో రాష్ట్ర రాజధాని అంశం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కేంద్రానికి ప్రశ్నించే అవకాశం లేదు. గతంలో చంద్రబాబు చేసింది కూడా ఇదే. అమరావతి విషయంలో ఆయన కేంద్రం నుంచి ఎలాంటి సలహాలూ తీసుకోలేదు. ఇక్కడి రైతులు భూములు ఇవ్వబోమని భీష్మించినప్పుడు ఆయన భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తానని చెప్పిన విషయాన్ని అప్పటి టీడీపీ నేత సుజనా సమర్ధించారు.
కానీ, ఇప్పుడు అధికారంలో పార్టీ మారిపోయి.. తమ విస్తృత ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుంటే మా త్రం ఆయన తట్టుకోలేక పోతున్నారు. కేంద్రానికి రాజధానుల నిర్ణయం దఖలు పడి ఉంటే.. అమరావతిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? అనేది కీలక ప్రశ్న. నిధులు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు? ఇలాంటి వాటికి ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ధర్నా చేస్తున్నవారిని, నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి ప్రజాస్వామ్యంలో పూర్తిస్థాయిలో హక్కు ఉంటుంది. అయితే, వాస్తవ స్థితిగతులను గుర్తిం చకుండా.. కేవలం జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ముందుకు సాగడం వల్ల ప్రజా ప్రయోజనానికే భంగమనే విషయాన్ని గుర్తించాలి.