పొగతాగే వారిపైనే కరోనా ప్రభావం ఎక్కువ

-

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా,ముసలి ముతకా అనే తేడా లేకుండా అందిరై ప్రభావం చూపిస్తోంది. అయితే చైనా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం పొగ తాగే వారిపై కోవిడ్ 19 వైరస్ ఎక్కవ ప్రభావం చూపుతోందని తేలినట్లు భారత వైద్యులు తెలిపారు. పొగ తాగేవారికి కరోనా సోకితే అదిగా ముందుగా వారి ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో పాటు ఛాతి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముందని హెచ్చరించారు.

పొగతాగే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వారిలో వైరస్ వ్యాపించే అవకాశాలు మిగతావారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్ పొర మందంగా ఉండటంతో వ్యార్థాలను బయటకు పంపేందుకు ఊపిరితిత్తులు కష్టపడతాయని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దక్కన్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.

ఒక సిగరెట్ ను పలువురు పంచుకుని తాగటం వల్ల కరోనా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుందని టాటా మెమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ విభాగం డైరెక్టర్ పంకజ్ చతుర్వేది పొగరాయుళ్లను హెచ్చరించారు…

Read more RELATED
Recommended to you

Latest news