అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ చరణ్ తోనేనా…

-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటిస్తోన్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత వరస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే రాం చరణ్ మాత్రం ఏ సినిమాకు ఇంకా కమిట్ అవలేదు. అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడితో చరణ్ నెక్ట్స్ సినిమా చేస్తాడని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒక కథను సిద్దం చేసే పనిలో అనిల్ ఉన్నాడని టాక్ నడుస్తోంది. అయితే కథ నచ్చితేనే చరణ్ సినిమా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు..

అయితే ప్రస్తుతం గతేడాది సంక్రాతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 కి సీక్వెల్ తీసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. వెంకీ,వరుణ్ తేజ్ లతో పాటు ఎఫ్3 సినిమాలో రవితేజ కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనిల్ ఈ రెండు ప్రాజెక్టుల్లో దేన్ని ముందు ఓకే చేస్తాడో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news