అమెరికాలో లక్ష దాటేసిన కరోనా కేసులు

-

అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కరోనా దెబ్బకు గజగజ వణికిపోతోంది. నిన్న మొన్నటి వరకూ ఇటలీ, ఇరాన్, చైనాల ను కూడా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. నిన్న ఒక్క రోజే కొత్త కేసులు సంఖ్య 15,537 నమోదు కావడంతో ఓవరాల్ గా కేసుల సంఖ్య లక్ష 970 కి చేరుకుంది. ఇదిలా ఉంటే వైరస్ వల్ల నిన్న 262 మంది మృతి చెందారు. దీంతో మొత్తం అమెరికాలో కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 1557 కి చేరుకుంది. మార్చి 18 నుంచి కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి ఇప్పుడు లక్షకు చేరుకోవటం భయాందోళనలు కలిగిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 183 దేశాల్లో 5,39,360 మంది దీని బారిన పడ్డారు. వీరిలో 1,12,200 మంది కరోనా బారి నుంచి కోలుకోగా 24,663 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశాలకు దేశాలు స్వచ్ఛందంగానే నిర్భందంలోకి వెళ్ళిపోయారు. అయితే చాలా దేశాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రికి తరలించే అవసరం ఉన్న వారికి మాత్రమే కరోనా పరీహక్షలు నిర్వహిస్తున్నారు.

చైనా తర్వాత కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీలో 80,539 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. 9,362 మంది కోలుకుంటున్నారు. ఇప్పటి వరకూ 8,165 మంది మృతి చెందారు. స్పెయిన్ లో 64,362 మందికి కరోనా సోకింది, దీంట్లో 8,165 మంది మృతి చెందారు…

Read more RELATED
Recommended to you

Latest news