దుర్గగుడి పై కరోనా ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు దుర్గగుడిలో పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. గత నెలలో జరిగిన టెస్ట్ లలో కొంతమందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. రెండు రోజుల క్రితం కరోనా తో దుర్గ గుడి వేద పండితుడు మృతి చెందడంతో అక్కడ ఉన్న ఇతర అర్చకులు కూడా కంగారు పడుతున్నారు. కరోనా లక్షణాలు తో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో గుడి ఈవో చికిత్స పొందుతున్నారు.
హోం క్వారెంటయిన్ కి పలువురు ఆలయ సిబ్బంది వెళ్ళారు. దీనితో ఇప్పుడు అక్కడ విధులు నిర్వహించే గుడి సిబ్బంది కరోనా భయంతో ఉన్నారు. అటు భక్తుల్లో కూడా ఆందోళన వ్యక్తమైంది. దీనితో ఆలయ సిబ్బంది చాలా వరకు కూడా విధులకు రావడం లేదు. ఇక గుడికి వచ్చిన భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ దీనిపై అప్రమత్తమైంది.