తెలంగాణాలో ఒక్కడి నుంచి 19 మందికి కరోనా…!

-

తెలంగాణా సహా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం మర్కాజ్ యాత్రికులు, మర్కాజ్ నుంచి వచ్చిన వారి నుంచి కరోనా సోకడం తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను స్వయంగా ముందుకి రావాలి అని విజ్ఞప్తి చేసినా సరే వాళ్ళు మాత్రం ముందుకి రావడం లేదు. వాళ్ళ కారణంగా రాష్ట్రాల్లో కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

వికారాబాద్‌కు చెందిన 19 మందికి కరోనా అంటించాడు. మంగళవారం అక్కడ కొత్తగా 5 కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 19 కి చేరగా ఆ 19 మందికి అతనే అంటించాడు అని గుర్తించారు. పట్టణానికి చెందిన ఓ సంస్థ నిర్వాహకుడు మార్చి 13న మర్కజ్‌కు వెళ్లి అదే నెల 19న అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ తర్వాత వికారాబాద్ లో పలువురిని కలిసాడు. కొంత మంది ఇంటికి విందుకి వెళ్ళాడు.

ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళగా అక్కడ అతనికి అధికారులు పరిక్షలు నిర్వహించారు. అక్కడ పాజిటివ్ అని రావడం తో ఇప్పుడు అధికారులకు తల నొప్పి మొదలయింది. అతను ఎంత మందిని కలిసాడు… అతని ఇంటికి ఎవరు వచ్చారు… ఎవరితో అతను సన్నిహితంగా ఉన్నాడు… వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు. ఇవి అన్నీ కూడా ఇప్పుడు తలనొప్పిగా మారాయి. వారి లెక్కలు సేకరించే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news