వైసీపీ నాయకులు ఎందుకు తప్పు చేస్తున్నారు…?

-

అవును ఇప్పుడు అధికార వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో పదే పదే తప్పులు చేస్తున్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే నిజం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని వాళ్ళు పదే పదే మీడియా కు దొరుకుతున్నారు. వాళ్ళ వ్యాఖ్యలతో పాటుగా వాళ్ళు ధరించే మాస్క్ లు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి… ప్రధాని మోడీ తో మాట్లాడిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేసారు.

పలానా మండలంలో కరోనా ఉంది పలానా మండలంలో కరోనా వైరస్ లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సాధారణం గా అన్ని రాష్ట్రాలు ప్రధానికి చెప్పిన సమయంలో జిల్లాల లెక్కలు చెప్పాయి. కాని జగన్ మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి మండలం లెక్క చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక అదే విధంగా ఆయన లెక్కలను కూడా తప్పు చెప్పారు. కరోనా కేసులను తగ్గించి చూపించే ప్రయత్నం చేసారు.

దీనిపై ఇప్పుడు అధికార పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసులు ఎక్కువగా ఉంటే కేంద్రం సహాయం చేస్తుంది. తక్కువ చేసి వాస్తవాలను దాస్తే కేంద్రం నుంచి వచ్చేవి ఏమీ ఉండవు. ఇక్కడ జగన్ చేసిన తప్పు కారణంగా కేంద్రం రంగంలోకి దిగి వాస్తవాలను చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డాక్టర్లు ధరించే సూట్ ని ధరించారు. ఆ సూట్ ధరించి ఆమె ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కూడా పదే పదే ఆమెను విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వైద్యులకు సరిపడా కిట్స్ లేవు అనే ఆరోపణలు వస్తున్న సమయంలో ఈ విధానం కరెక్ట్ కాదని అనవసరం దొరికిపోయే అవకాశాలు ఉంటాయని విమర్శలకు వేదిక అవుతుంది అని భావిస్తున్నారు. ఇక ఎన్నికల సంఘం అధికారిని మార్చడం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్దంగా ఉండాలని ఎన్నికల అధికారి చెప్పడం. ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు విమర్శలకు వేదిక అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news