గాలితోనే కరోనా వైరస్.. షాకింగ్ సర్వే !

-

గాలితోనే కరోనా వైరస్ వ్యాపిస్తుందని లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ లో సంచలన కధనం ప్రచురితం అయింది. గాలి ద్వారానే కరోనా సోకుతుందని బ్రిటన్, అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. దగ్గినా, తుమ్మినా గాలిలోకి కరోన వైరస్ వస్తోందని గుర్తించారు. సైలెంట్ ట్రాన్స్మిషన్ వలెనే 40 శాతం కేసులు నమోదవుతున్నాయని గుర్తించారు. రోగి చుట్టూ మూడు మీటర్ల వరకూ వ్యాప్తి ఉంటోందని లాన్సెట్ కధనం పేర్కొంది.

మూసి ఉన్న ఏసీ గదుల్లో 20 అడుగుల దాకా వ్యాప్తి ఉంటోందని గుర్తించారు. ఇక లాన్సెట్ అధ్యాయాన్ని సీసీఎంబీ కూడా ధృవీకరించింది. పబ్లిక్ టాయిలెట్లు, హాస్పిటల్స్ వైరస్ వాహకలు అని సీసీఎంబీ పేర్కొంది. దేశంలో మరియు అనేక రాష్ట్రాలలో పెరుగుతున్న COVID-19 కేసులలో ప్రస్తుత “ప్రమాదకరమైన” ధోరణిని నియంత్రించడానికి ప్రజలను గుమికూడి ఉండే కార్యక్రమాలు నిర్వహించకుండా  ప్రభుత్వాలు నియంత్రించాల్సిన అవసరం ఉందని  సీసీఎంబీ పేర్కొంది. 

Read more RELATED
Recommended to you

Latest news