కరోనా కేసుల్లో భారత్ నయా రికార్డ్..!

-

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకి దీని తీవ్రత పెరిగిపోతుంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,455 కరోనా కేసులు నమోదు కాగా 386 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,993కి చేరగా మొత్తం మరణాల సంఖ్య 8,884 కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1,54,329 మంది డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం 1,45,779 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొన్నటి దాక మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చిన కేసుల సంఖ్య లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రపంచంలోనే 4 వ స్థానంలో ఉంది భారత్. ఇది ఇలానే కొనసాగితే అగ్రరాజ్యాన్ని దాటడానికి మనకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అని అంటున్నారు నిపుణులు.

కాగా మ‌రో వైపు దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకీ భారీగా పెరుగుతుండ‌డంతో ప్ర‌ధాని మోదీ మళ్లీ దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించే ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే ముందుగా ప్ర‌ధాని అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ల‌తో మాట్లాడాకే ఆ నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా జూన్ 16, 17 తేదీల్లో ప్ర‌ధాని మోదీ సీఎంల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఇక దేశంలో మ‌హారాష్ట్ర 1 ల‌క్ష కేసులు దాటిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించ‌గా, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు ఆందోళ‌న‌క‌ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో హాస్పిటళ్ల‌లో చికిత్స అందించేందుకు బెడ్ల కొర‌త ఏర్ప‌డింది. మ‌రోవైపు వైద్య సిబ్బంది కూడా త‌క్కువ‌గా ఉండ‌డం ప్ర‌జ‌ల‌ను మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news