హ‌మ్మ‌య్య‌.. ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా..!!

-

క‌రోనా.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. ఇదే భ‌యం, ఇదే టెన్స‌న్ నెల‌కొంది. క‌రోనా అన్న పేరు వింట‌నే ప్ర‌జ‌లు ఆమ‌డ దూరం కాదు.. అంత‌క‌న్నా ఎక్కువే ప‌రిగెడుతున్నారు అన్న‌ది వాస్తం. ఎందుకంటే.. క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుంది. మొద‌ట చైనాలో పుట్టిన ఈ వైర‌స్‌.. ఆ త‌ర్వాత ఒక్కో దేశంపై దండ‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌ను బ‌లితీసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి 200 దేశాల‌కుపైగా వ్యాపించింది. ఇక ఆయా దేశాల ప్ర‌జలు క‌రోనా దెబ్బ‌కు అబ్బా అంటున్నారు. ముఖ్యంగా పెద్దన్న‌గా చెప్పుకునే ఆగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా కోర‌ల్లో ప‌డి చిగురుటాకులా వ‌ణికిపోయింది.

అమెరికాలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికాలో ఆరు లక్షల మందికిపైగా ఈ వైరస్‌కి చిక్కగా, 26 వేల మందికిపైగా మృతి చెందారు. కోవిడ్ కేసుల్లోనూ, మరణాల్లో అమెరికాదే మొద‌టి స్థానం. అయితే ప్ర‌స్తుతం అమెరికా ఊపిరి పీల్చుకుంటుంది. కరోనా కోరల్లో నలుగుతున్న అమెరికాలో పరిస్థితి ప్ర‌స్తుతం మెరుగవుతున్నట్లే కనిపిస్తోంది. గ‌త కొద్దిగా రోజులుగా వేల కొద్దీ మరణాలు, పాజిటివ్‌ కేసులతో ప్రమాద ఘంటికలు మోగినా.. ఇప్పుడు మాత్రం అక్క‌డ క‌రోనా జోరు త‌‌గ్గుతున్న‌ట్టు తెలుస్తోంది.

అలాగే న్యూయార్క్‌ను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు అక్కడ కూడా నెమ్మదించింది. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా గత వారాంతం నుంచీ కొత్త కేసులు తగ్గుతున్నాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీలాంటి హాట్‌స్పాట్లలో కూడా ఆస్పత్రులకు రోగుల రాక తగ్గింద‌ని ఆయ‌న పెర్కున్నారు. ఇదే క్ర‌మంలో అక్క‌డ లాక్‌డౌన్‌ ఎత్తేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news