షాకింగ్: నెగిటివ్ వచ్చినా వదలను అంటున్న కరోనా…!!

-

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు కుదేలు అయిపోతున్నాయి. చైనా,ఇటలీ,ఇరాన్,అమెరికా, స్పెయిన్,జర్మనీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలు ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నాయి. రోజు రోజుకు ఈ కరోనా వైరస్ మరణాలు పెరుగుతూ పోతుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా,40 వేలమందికి పైగా ఈ కరోనా వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకుంటే తిరిగి మామూలు మనుషులు అయిపోతారు అని అందరూ భావిస్తున్నారు. అయితే చైనా లో మాత్రం ఇటీవల ఒక నమ్మలేని నిజం బయటపడినట్లు తెలుస్తుంది.

కరోనా తగ్గిన వ్యక్తి కి నెగిటివ్ అని వచ్చిన తరువాత కూడా ఆ రోగి కళ్లే,మలం నమూనాలో కరోనా వైరస్ కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఈ కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే అగ్రరాజ్యం తో పాటు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే ఇలా కరోనా రోగి డిశ్చార్జ్ చెసే ముందు చేసే టెస్ట్ లలో ఇలాంటి రిజల్డ్ వచ్చినట్లు తెలుస్తుంది. కరోనా కు ఎఫెక్ట్ అయిన వ్య‌క్తిని హాస్పిట‌ల్ నుంచి డిచ్చార్జ్ చేసేముందు ఎక్కువ‌గా క‌ఫం ద్వారా టెస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరి పేషేంట్స్ కు టెస్టులు నిర్వహించగా ఇలాంటి రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే వచ్చిన రిజ‌ల్ట్స్ సరైనవేనా.. లేక బాడీలోని ఇతర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు ఇంకా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. టెస్టుల్లో కోవిడ్ నెగిటివ్​ అని తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లె,మలం లో కరోనా ఉన్నట్లు గుర్తించడం గమనార్హం.

రోగుల కళ్లే లో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు ఈ డేంజ‌ర‌స్ వైరస్​ ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతుంది. ఇలాంటి సమయంలో ఈ వైరస్ రోగి నుంచి ఇతరుల‌కు వ్యాప్తి చెందుతుంద‌నే విష‌యంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యంపై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌ర‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news