వర్మకు కరోనా పాజిటివ్…షాక్ అయిన నెటిజన్లు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు కరోనా పాజిటివ్? ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మరి తెలిపారు. ఆయన గారి ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బయటకు ఎవరూ వెళ్ళకూడదు అని,చాలామంది సెలబ్రిటీలు ఇంట్లో నుంచి అడుగుకూడా బయటకు పెట్టడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీలు కనీసం బయటకు కూడా కనిపించడం లేదు. అలాంటిది వర్మకు కరోనా రావడం ఏంటి అని నెటిజన్లు ఆ ట్వీట్ ను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడే తన డాక్టర్ ఫోన్ చేసి నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు అంటూ వర్మ ట్వీట్ చూసిన అభిమానులు అలా ఎలా జరిగింది అంటూ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లారు. కరోనా గురించి పాట కూడా పాడి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది వైరల్ గా కూడా మారింది. ఇంత ఇదిగా పాట పాడిన నీకు కరోనా సోకిందా అయ్యో పాపం అంటూ చాలా మంది జాలి కూడా చూపించారు. ఇంట్లోనే అందరూ లాక్ అవ్వాలి అంటూ నువ్వే ప్రతిరోజూ అందరికీ చెబుతూ ఉంటావు,అలాంటిది నీకే ఈ కరోనా వైరస్ రావడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అందరూ షాక్ కు గురై ఆతృతగా వివరాలు తెలుసుకుంటున్న సమయంలో ఏప్రిల్ ఫూల్ అంటూ రిప్లై ఇవ్వడం తో ఒక్కసారిగా నెటిజన్లు మండిపడ్డారు.

కరోనా సోకినట్లు ట్వీట్ చేసిన 15 నిమిషాలకు సారీ అందర్నీ డిసప్పాయింట్ చేసాను.. నాకు కరోనా లేదంట.. నా డాక్టర్ నన్ను ఎప్రిల్ ఫూల్ చేశారట. ఇది నా తప్పు కాదు ఆయనదే అంటూ మరో ట్వీట్ చేసాడు. అయితే అది చూసిన కొంతమంది ఊపిరి పీల్చుకోగా మరికొందరు మాత్రం కరోనాతో కూడా కామెడీలా అంటూ వర్మ చేసిన పనికి తిట్టిపోస్తున్నారు. వొడ్కా దొరక్క వ‌ర్మ మాన‌సిక ప‌రిస్థితి కూడా క్షీణించింద‌ని..ఎర్ర‌గడ్డ‌కు త‌ర‌లించాలంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు కూడా.