పశ్చిమబెంగాల్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. ఏండేండ్ల బాలుడికి నిర్ధారణ

-

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరో రాష్ట్రానికి పాకింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నూతన వేరియంట్ బారిన పడిన ఏడేండ్ల బాలుడు ఇటీవల అబుదాబి నుంచి భారత్‌కు వచ్చాడు. ముర్షిదాబాద్‌కు చెందిన బాలుడు డిసెంబర్ 10న అబుదాబి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి పశ్చిమబెంగాల్‌కు వచ్చాడు.

కోల్‌కతా విమానాశ్రయంలో ఆ బాలుడికి కొవిడ్ టెస్టు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతని నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా నూతన వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడైంది. చికిత్స కోసం బాలుడిని ముర్షిదాబాద్ జిల్లాలోని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news