సీఎం జగన్ కు బిగ్ షాక్.. సినిమా టికెట్ల పై అమిత్ షా కు ఫిర్యాదు

-

జగన్ సర్కార్ పై హోంమంత్రి అమిత్ షా ను కలిశానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. అమరావతి పాదయాత్ర గురించి వివరించానని.. సినిమా టికెట్ల గురించి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 17 వతేదీన జరిగే సభ గురించి వివరించానని… 17 వతేది సభకు వెళ్లాలని నేను అనుకుంటున్నాను అని చెప్పానని ఆయన వెల్లడించారు. నేను తిరుపతి సభకు వెళ్తే నా పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. రెండు రోజుల నుండి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారన్నారు. తెలిసి తెలియన తనంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బ్రష్టుపట్టించారని.. ఓటుకు కోసం మేము ఏమైనా చేస్తామని వెల్లడించారు.

జగన్ సీపీఎస్ రద్దు చేస్తా అన్నారు…చేస్తారా లేక వెనక్కి తీసుకుంటారో చూడాలి.. ఎవరో సినిమా తీస్తే దానికి నేను రేటు ఫిక్స్ చేస్తామని మా ప్రభుత్వం అంటుందన్నారు. పవన్ కళ్యాణ్ పై కోపం తో ఇలా చేయకండి… ప్రభుత్వమే మంచి సినిమాలు తీసి ఉచితంగా టికెట్లు ఇవ్వండని తెలిపారు. జగనన్న సినిమా దీవెన మాకు వద్దు….కొందరి పై కక్ష్య తో ఇలాంటి పనులు చేస్తున్నారు,ఇది పద్దతి కాదని.. మిథున్ రెడ్డి నిధులు లేవు దారుణంగా రాష్ట్ర పరిస్థితి ఉందని లోక్ సభలో అన్నారని తెలిపారు. నేను కూడా గతంలో పార్లమెంట్ సాక్షిగా అదే చెప్పాను దానికే కొందరు ఎంపిలు నా పై మాటల దాడి చేశారని.. అమరావతి మహా పాదయాత్ర రైతులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారని వెల్లడించారు. దర్శనం టికెట్లు ముందే ఇవ్వొచ్చు కదా? ప్రజలు ప్రభుత్వాన్ని చీ కొడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ పై జగన్మోహన్ రెడ్డి కి ప్రేమ ఉంటే ముందు గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులకు పూర్తి చేయండి..వృద్దులకు ఇచ్చే సొమ్ము పై కూడా జగనన్న దీవెన ఏంటి ఇది?ప్రతిదానికి మీ పేర్లు,మీ దీవెనలు ఎందుకు ? అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news