శవాలను పబ్లిక్ పార్కుల్లో…

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు మరణాల సంఖ్య చాలా భారీగా పెరుగుతుంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో మరణాలు వేలల్లో ఉంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు మరణాలను అదుపు చేయడం ట్రంప్ సర్కార్ కి చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ మరణాలు రోజు రోజుకి పెరగడం తో ట్రంప్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు.

అయితే ఇప్పుడు అక్కడ శవాలను ఉంచడానికి ప్రదేశాలు కనపడట౦ లేదు. గుట్టలు గుట్టలు గా శవాలు పెరగడం తో ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. దీనితో స్థలాలు ఖాళీ గా లేక పబ్లిక్ పార్కుల్లో ఖననం చేస్తున్నారు. భారీగా గుంతలు తవ్వి అందరిని సామూహికంగా ఖననం చేస్తుంది అమెరికా సర్కార్. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. న్యూయార్క్ లో రోడ్ల మీద శవాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా అంటుంది.

అక్కడ మృతులు రోజు రోజుకి పెరుగుతున్నారు. దీనితో ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా అక్కడ మరణాలను కట్టడి చెయ్యాలో అర్ధం కాక ప్రజలను రోడ్ల మీదకు రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. ఇక వృద్దులు ఎవరైనా ఆస్పత్రులకు వస్తే వాళ్ళను జాయిన్ చేసుకోవడం లేదు. దీనితో కరోనా వచ్చింది అని తెలిస్తే వృద్దులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి అమెరికా ఇప్పుడు దిగజారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news