కోనసీమ తిరుపతి ఆలయ విశేషాలు…!

-

తిరుపతి అనగానే చిత్తూరు లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం లేదా పశ్చిమ గోదావరిలో ఉన్న ద్వారకా తిరుమల అనే అందరు అనుకుంటారు. కాని అక్కడ రక్త చందనం నుండి ఉద్భవించిన స్వయం భూ వేంకటేశ్వరుడు వెలసిన క్షేత్రం ఎక్కడ ఉందో, అక్కడ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం పట్టణానికి 10 కి. మి దూరంలో వాడపల్లి అనే గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గౌతమి నది తీరాన ఉన్న ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతి అని అంటారు. ఈ క్షేత్రంలో మూల విరాట్టు విగ్రహం రక్త చందనం అనే కొయ్య నుండి అవతరించిన స్వయంభూ మూర్తి అని పురాణం చెబుతుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కోనసీమ ప్రాంతంలో మూడు క్షేత్రాలలో వేంకటేశ్వరుడు స్వయంభువులుగా కొలువై ఉన్నాడు.

అయితే స్థానికంగా ఉన్న కథనం ప్రకారం ఇక్కడ స్వామి మూడు వందల సంవత్సరాల క్రితం గోదావరి నది తీరాన ఇసుక నందు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. అంతేకాక ఇక్కడ స్వామి శ్రీ దేవి, భూ దేవి దేవేరులతో ఉన్న స్వామి భక్తుల కోరికలు తీర్చే ఆపద్భాంధవుడిగా, సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే స్వామి గా ప్రసిద్ధి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news