పులివెందులకు నీళ్ళు రాకుండా షర్మిల అడ్డుకుంటారా.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే..

-

తెలంగాణ రాజకీయాల్లో మరీ ప్రాంతీయ పార్టీ పుట్టుకు వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు వైయష్ షర్మిల, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటించింది. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం గురువారం జరిగింది. ఆ ఆవిర్భావ కార్యక్రమంలో వైయశ్ షర్మిల తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో వివాదంలో ఉన్న నీటి పంచాయితీపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, స్వీట్లు తినిపించుకుంటారు గానీ, నీటి వివాదంపై ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోలేరా అని, అలాగే రెండేళ్ళ నుండి ప్రాజెక్టులు కడుతుంటే అప్పటి నుండి ఎందుకు మాట్లాడలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసారు.

ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, షర్మిల వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోనన్న షర్మిల వ్యాఖ్యలపై, పులివెందులకు నీళ్ళు రాకుండా షర్మిల అడ్డుకుంటారా అని కామెంట్ చేసారు. ఇంకా ఇదంతా కేసీఆర్, షర్మిల ఆడుతున్న నాటకం అన్ని ఎద్దేవా చేసారు. ఏదైమైనా షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news