జగన్ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్న కోర్టులు…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు హైకోర్ట్ పెద్ద తలనొప్పిగా మారింది. జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా హైకోర్ట్ కి వెళ్ళడం అక్కడ షాక్ తగలడం వంటివి గత ఏడాది కాలంగా జరుగుతూనే వస్తున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఏదోక సందర్భంలో కోర్ట్ ఇబ్బంది పెడుతూనే ఉంది.

ఇంగ్లీష్ మీడియం విషయంలో సర్కార్ ఆలోచన ఏ విధంగా ఉన్నా సరే కోర్ట్ మాత్రం వద్దని స్పష్టంగా చెప్పింది. ఇంగ్లీష్ మీడియం విషయంలో ముందు నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏదోక సందర్భంలో విపక్షాలు దీన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పి కొట్టినా సరే… కోర్ట్ లోమాత్రం తన వాదన అనేది బలంగా వినిపించలేక ఇబ్బంది పడింది.

పెద్ద పెద్ద లాయర్లు ఉన్నా సరే జగన్ సర్కార్ మాత్రం కోర్ట్ లో ఇబ్బందులు పడుతూనే ఉంది. ఇంగ్లీష్ మీడియం విషయంలో జీవో రద్దు చేసింది, అమరావతి విషయంలో కోర్ట్ సీరియస్ అయింది. రాజధాని తరలింపు అడ్డుకుంది, ఇక పోలీసుల వ్యవహారంపై కూడా సీరియస్ అయింది, డీజీపీ ని కోర్ట్ కి పిలిచింది, చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు కోర్ట్ నుంచి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

ఇళ్ళ స్థాలాల పంపిణి విషయంలో… రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యు శాఖ అధికారులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు చేస్తే అధికారులు ఇబ్బంది పడతారు అని స్పష్టంగా చెప్పింది. ఇలా ఏ విధంగా చూసినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కోర్ట్ లో ఎక్కడా కూడా మంచి పరిణామం అనేది లేదు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కోర్ట్ ని విమర్శించలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. అటు సిఎస్ నీలం సహాని కూడా కోర్ట్ లొఇబ్బన్ధులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news