తెలంగాణాలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను తెలంగాణా సర్కార్ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తు చర్యలు చేపడుతుంది. కరోనా వైరస్ తీవ్రత ఎప్పటికప్పుడు పెరుగుతుంది గాని తగ్గడం లేదు. ఇప్పుడు దీన్ని కట్టడి చేయడానికి గానూ… ప్రభుత్వం ఇక సరికొత్తగా ఆలోచించాలి అని అధికారులకు సూచనలు చేస్తున్నారు ప్రభుత్వాధినేతలు. లాక్ డౌన్ ని తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో పక్కగా అమలు చెయ్యాలి. ఈ లాక్ డౌన్ అమలు సమయంలో కేసులు బయటకు వస్తే… అక్కడ ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుని హాట్ స్పాట్ గా గుర్తించాలి.
ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ అమలు కఠినం గా ఉంటుంది అని మోడీ చెప్పారు. కాని కేసీఆర్ మాత్రం అలా కాదని… దీన్ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని… కేంద్రం తో సంబంధం లేకుండా లాక్ డౌన్ పై ప్రాంతాల వారీగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరెంజ్ జోన్ అయినా సరే ఏ మాత్రం అలసత్వం వద్దని చెప్పారు ఆయన. అధికారులు కొందరు హాట్ స్పాట్ ప్రాంతాల నుంచి బయటకు రావొద్దు. ఎవరూ కూడా ఆ ప్రాంతం నుంచి బయటకు రాకుండా అక్కడే ఉండాలి అనేది ఆయన ఆదేశాలు.
ఇక స్థానిక ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో ఒంటరి గానే తిరగాలి. ఇప్పుడు భద్రతా సమస్యలు ఉండవు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎవరికి చెప్పకుండా వెళ్ళాలి. ఆయన పూర్తిగా శానిటేషన్ చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్ళాలి. ఏ అవసరం కోసం కూడా హైదరాబాద్ రావొద్దని ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. 8 జిల్లాలు హాట్ స్పాట్ కాబట్టి 8 మంది మంత్రులు అక్కడే ఉండాలి. ఎవరూ కూడా బయటకు రావొద్దు అని, అధికారులతో సమన్వయం చేసుకుని… ప్రధాన కార్యదర్శి తో టచ్ లో ఉండాలని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.