ఇండియా తయారీ కోవాగ్జిన్ అత్యవసర అనుమతులకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. అత్యవసర అనుమతులపై చర్చించేందుకు నిన్న సమావేశం అయిన WHO సాంకేతిక సలహా గ్రూప్ మరింత సమాాచారం కావాలని భారత్ బయోటెక్ సంస్థను కోరింది. ఇప్పటికే పలుమార్లు అదనపు సమాచారం కావాలని WHO కోరింది. తాజాగా మళ్లీ సమచారం కోరడంతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి మరిన్ని రోజులు పట్టనున్నాయి. నవంబర్ 3న అత్యవసర వినియోగపు అనుమతుల గురించి WHO సాంకేతిక సలహా గ్రూప్ మళ్లీ సమావేశం జరుగనుంది. గత కొన్ని రోజులుగా ఇండియా భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు అదనపు సమాచారం పేరిట మోకాలడ్డుతోంది. WHO నుంచి అనుతులు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం WHO అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి.