నేటితో బద్వేల్ ప్రచారినికి తెర..!

బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడనుంది. ఈరోజు సాయంత్రం నుంచి మారుమోగిన మైకులు మూగబోనున్నాయి. ఇన్ని రోజులు ప్రచారాలతో బద్వేల్ హొరెత్తిపోయింది. టిడిపి పోటీలో లేకపొయినా ….వైసిపి, బిజేపిల విమర్శలు… అరోపణలతో అంతకంతకూ రాజకీయ వేడి పెరిగింది. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పల్లెల్లో తిష్టవేసి ప్రచారం నిర్వహించారు.badvel

వైసిపి నుంచి ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బద్వేలులోనే తిష్ట వేసి ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా ముందు ఉండి బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇక బద్వేలులో జరిగిన అభివృద్ది తమదేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. ఇదిలా ఉంటే బద్వేలు పోలింగ్ కు మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. దాంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందా అని ఉత్కంఠ నెలకొంది.