కోవాగ్జిన్ కు WHO షాక్.. అత్యవసర వినియోగానికి నో

-

దేశీయ వ్యాక్సిన్ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ కు WHO షాక్ ఇచ్చింది. విదేశాల్లో వినియోగించేందుకు నో చెప్పింది. అత్యవస వినియోగానికి మరింత సమచారం కావాలని WHO కోరింది. దీంతో మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పని పరిస్థతి ఏర్పడింది. కాగా కోవాగ్జిన్ టీకా తీసుకుని విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. వీసా సమయంలో విదేశాలు తిరస్కరించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, చైనా తయారు చేసిన సినోవాక్ లకు మాత్రమే అత్యవసర అనుమతి ఇచ్చింది. మరదేశంలో ఆస్ట్రాజెనికా టీకానే సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. కాబట్టి ఈ టీకా వేసుకున్న వారికి విదేశాలు వెళ్లడానికి ఎటువంటి సమస్యలు లేవు. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే పూర్తిగా దేశీయంగా తయారు చేసిన టీకాగా రికార్డ్ స్రుష్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news