Covid-19: గుడ్ న్యూస్… డెల్టా వేరియంట్ కన్నా ఓమిక్రాన్ నుంచే త్వరగా రికవరీ

-

చైనా వూహన్ నగరంలో రెండేళ్ల క్రితం పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ XE ఇలా తన రూపాలను మార్చుకుంటూ… ప్రజలపై దాడి చేస్తోంది. తాజాగా చైనాలో కరోనా కేసులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు వచ్చినా… ఏదో రూపంలో మళ్లీ కరోనా దాడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం మరో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ XE వేరియంట్ భయపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్ లో 600కు పైగా ఓమిక్రాన్ XE వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇండియాలో ముంబైలో తొలి ఓమిక్రాన్ XE కేసు నమోదైంది. 

ఇన్ని భయాల మధ్య ఓ గుడ్ న్యూస్ చెప్పారు ‘ కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు. డెల్టా వేరియంట్ సోకిన వారి కన్నా ఓమిక్రాన్ సోకిన వారిలో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని పరిశోధనల్లో తేలింది. బ్రిటన్ లో రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడిన 63వేల మంది డేటాను కింగ్స్ కాలేజ్ లండన్ పరిశీలించగా… ఈ విషయాలు వెల్లడయ్యాయి. మూడో డోస్ తీసుకున్నవారిలో అయితే ఓమిక్రాన్ లక్షణాలు మరింత త్వరగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news