ఇండియాకు మూడో ముప్పు పొంచి ఉందా..? ఇతర దేశాల్లో కరోనా పరిస్థితులు ఏం చెబుతున్నాయి.

-

థర్డ్ వేవ్ ముప్పు ముంచుకు వస్తుందా..? త్వరలోనే ఇండియా పై కూడా ప్రభావం చూపిస్తుందా..? అంటే ప్రపంచంలో పలు దేశాల పరిస్థితులు చూస్తే ఇండియాకు కూడా థర్డ్ వేవ్ ముప్పు తప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో కొన్ని వారాలుగా తక్కువ కేసులే నమోదవుతున్నాయి. దేశంలో రోజూ వారీ కేసులు 50 వేల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఏ.వై 4.2 రకం బయటపడుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా కేసులు, మరణాల సంఖ్య గత రెండు నెలలుగా క్రమంగా పెరుగుతుండటం కలవరపరుస్తోంది. ముఖ్యంగా అభివ్రుద్ది చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించినా… ఇటీవల కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు:

ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని వారాల్లో దాదాపు 3 మిలియన్ల కొత్త కేసులు పెరగడంతో పాటు 49 వేల మరణాలు చోటు చేసుకున్నాయి. మరణాల శాతం 4 నుంచి 5కు పెరిగింది. యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాల్లో గత వారంతో పోలిస్తే ఈ వారం కరోనా కేసులు 13 నుంచి 14 శాతానికి పెరిగాయి. యుఎస్‌లో, గత 24 గంటల్లో 80,000 కంటే ఎక్కువ కొత్త ఇన్‌ఫెక్షన్లు మరియు 1,681 మరణాలు నమోదయ్యాయి, UK లో, 41,278 మంది వ్యక్తులకు కోవిడ్ -19 సోకింది. శనివారం 166 మంది వైరస్‌తో మరణించారు. రష్యాలో, రోజువారీ 39,000 తాజా ఇన్ఫెక్షన్లు మరియు 1,163  మరణాలు సంభవించాయి. ఉక్రెయిన్ (26,870), టర్కీ (25,528), జర్మనీ (24,668) మరియు బ్రెజిల్ (17,184) దేశాలు కరోనా కొత్త వేవ్ కేసుల తో ఇబ్బందులు పడుతున్నాయి. చైనా లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలను చూస్తే రానున్న రోజుల్లో భారత్ లో కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news