ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధానంగా అమెరికా తర్వాత బ్రెజిల్‌లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కరోజులోనే ఏకంగా 47,161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో బ్రెజిల్‌లో ఇప్పటివరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,717,156కు చేరుకుంది. 24గంటల్లోనే 1,085మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 117,665కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది.
ఇక మూడో స్థానంలో భారత్ ఉంది. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,307,749కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24,315,420మంది వైరస్ బారినపడ్డారు. 16,842,031మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 828,721మంది కరోనాతో మరణించారు. ఇక అత్యధికంగా అమెరికాలో 5,998,666కు కేసుల సంఖ్య చేరుకుంది.