సినీ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన వనితా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ‘చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితం చాలా కష్టమైంది. మన లైఫ్‌లో జరిగే ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని నేను నమ్ముతాను. పరిస్థితులు అన్ని సర్దుకుంటాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే చాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి వనిత కృతజ్ఞతలు తెలిపింది. ఇకపోతే వనితావిజయకుమార్ ఇటీవలే పీటర్‌పాల్ ని మూడవ వివాహం చేసుకున్న విషయం తెలిసింది. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే వనితా తన భర్తను వివాహం ఎలా చేసుకుంటుందంటూ పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ ఆరోపణలు చేసింది. డబ్బు కోసమే ఇవన్నీ చేస్తుందంటూ ఆమె వనితపై కేసు కూడా ఫిర్యాదు చేసింది.