మళ్లీ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు… నేడు ప్రభుత్వ కీలక నిర్ణయం…!

-

తెలంగాణలో విద్యాసంస్థల బంద్, ఆన్లైన్ క్లాసులపై ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవును ఇచ్చారు. తాజాగా నేటితో సెలవులు ముగుస్తున్నాయి. దీంతో సెలవులను పొడగించడమా… లేకపోతే ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించడమా.. అనేది నేటితో తెలియనుంది. దీనిపై విద్యాశాఖ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కరోనా కేసులు సంఖ్య తెలంగాణలో మళ్లీ పెరుగుతుండటంతో విద్యా సంస్థలు మళ్లీ మూతపడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆన్ లైన్ క్లాసులకు మళ్లీ అనుమతించే అవకాశం ఉంది. రాష్ట్రంలో గతంలో కేసుల సంఖ్య కేవలం 1000కి లోపే ఉండేది. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 2500 పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళకు గురిచేస్తోంది. దీంతో పాటు ఓమిక్రాన్ కేసులు ప్రస్తుతం జిల్లాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో దాదాపుగా విద్యాశాఖ మళ్లీ విద్యార్థుల ఆన్ లైన్ చదువులకే మొగ్గు చూపే అవకాశమే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news