సౌతాఫ్రికా లో ఓమిక్రాన్ వేగం గా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం సౌతాఫ్రికా, ఇండియా క్రికెట్ పై పడింది. ఈ నెల 17 నుంచి సౌతాఫ్రికా లో ప్రారంభం కావాల్సిన టీ 20 సిరీస్ వాయిదా పడింది. దీంతో సౌతాఫ్రికా కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్ల సౌత్ ఆఫ్రికా పర్యటన డిసెంబరం 26 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన టీ 20 సిరీస్ పూర్తి గా వాయిదా పడింది.
దీంతో ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు తో టీమిండియా పర్యటన ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ సెంచూరియాన్ లో ఉంటుంది. అలాగే జనవరి 3 నుంచి రెండో టెస్టు జోహన్నెస్ బర్గ్ లో ప్రారంభం అవుతుంది. అలాగే కేప్ టౌన్ లో జనవరి 11 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం అవుతుంది. మూడు టెస్టు సిరీస్ ల అనంతరం మూడు వన్డే ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే పార్ల్ లో జనవరి 19 న జరగనుంది. అలాగే రెండో వన్డే కూడా పార్ల్ లో నే జనవరి 21 న నిర్వహిస్తారు. చివరి వన్డే జనవరి 23 న కేప్ టౌన్ లో నిర్వహించనున్నారు. కాగ మూడు టీ20 ల సిరీస్ షెడ్యూల్ మాత్రం సౌత్ ఆఫ్రికా ప్రకటించలేదు.