అగ్రరాజ్యమైన అమెరికా కరోనా వైరస్ వ్యాప్తిలోనూ అగ్రగామిగా నిలుస్తుంది. ఇప్పటి వరకూ 11 మిలియన్లు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంటే, కరోనా మరణాలు మరింత భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల స్థానంలోనూ అగ్రస్థానంలో ఉన్న అమెరికా, రెండు లక్షల యాభైవేల మార్కుని చేరుకుంది. ఒక రోజులో 1,176 మరణాలతో కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ప్రస్తుతానికి థర్డ్ వేవ్ భీబత్సం సృష్టిస్తుంది. బుధవారం రోజున 78, 630 కేసులు వచ్చాయంటే కరోనా ఉధృతి ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకీ పెరుగుతున్న కేసుల కారణంగా, అమెరికా వైద్య విభాగం పైన తీవ్ర ఒత్తిడి పడుతుంది. రోగులకి కావాల్సిన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే కరోనా నియమ నిబంధనలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే స్టార్ట్ అయిన పాఠశాలలని కూడా మూసేస్తున్నారు.