సీఎం జ‌గ‌న్ వెక్కిలి న‌వ్వులు న‌వ్వ‌డం సిగ్గుమాలిన చ‌ర్య : బుచ్చ‌య్య చౌద‌రి

-

టీడీపీ అధినేత చంద్ర బాబు నేడు అసెంబ్లీ స‌మావేశాల్లో ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌మ కుంటుంబంలోని ఆడ‌వాళ్ల‌పై అస‌భ్య‌క‌రంగా కామెంట్లు చేస్తున్నారంటూ చంద్ర‌బాబు కంట‌త‌డి పెట్టుకున్నారు. అంతే కాకుండా తాను సీఎం అయ్యేవర‌కు మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్ట‌న‌ని చంద్ర‌బాబు ఏడ్చుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. చంద్ర‌బాబుతో పాటూ నారాలోకేష్ కూడా అసెంబ్లీ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

gorantla bucchiah chowdar comments
gorantla bucchiah chowdar comments

కాగా తాజాగా చంద్ర‌బాబు మాట్లాడుతున్న క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ వెక్కిలి న‌వ్వారంటూ టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీచ‌మైన పార్టీ వైఎస్ ఆర్ సీపీ అంటూ వ్యాఖ్యానించారు. అసలు వైసీపీలో విజ్ఞ‌త గ‌ల నాయ‌కులు ఉన్నారా అంటూ బుచ్చ‌య్య చౌద‌రి మండిప‌డ్డారు. లేదంటే ప‌నికిమాలిన నేత‌లు ఉన్నారా అంటూ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చంద్ర‌బాబు ఏడుస్తుంటే వెక్కిలి న‌వ్వులు న‌వ్వ‌డం ప‌నికిమాలిన చ‌ర్య అని…ప్ర‌భుత్వానికి ప‌త‌నం ప్రారంభం అయ్యింద‌ని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news