ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా ఫైజర్, బయోఎన్ టెక్ లు ఈరోజు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ ప్రకటన విడుదల చేయబడిందని అంటున్నారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం, రెండు మోతాదులలో రెండవది ఏడు రోజుల తరువాత, మరియు మొదటి 28 రోజుల తరువాత రోగులలో ఫలితం కనిపించిందని అంటున్నారు.
మూడో విడత కరోనా వ్యాక్సిన్ ట్రయల్ ఫలితాలు మొదటి సెట్ కోవిడ్ ను నివారించగల టీకా సామర్ధ్యానికి ప్రాథమిక సాక్ష్యాలను అందిస్తుందని ఫైజర్ చైర్మెన్ సీఈఓ అర్బర్ట్ బౌర్లా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ రేట్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మళ్ళీ నిండడం మొదలయింది. 2020 లో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులను, 2021 లో 1.3 బిలియన్ మోతాదులను సరఫరా చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.