వైన్ షాప్ టెండర్లలో అత్తాకోడళ్ళ హవా…తొమ్మిది వేస్తే నాలుగు వారికే..!

-

రీసెంట్ గా తెలంగాణలో వైన్ షాప్ టెండర్ల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. దీనికి సంభందించి ఎవరెవరు టెండర్లు దక్కించుకున్నారో నిన్న వెల్లడించారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ఓ కుటుంబాన్ని అదృష్టం జలగలా పట్టుకుంది. ఒక్క వైన్ షాప్ టెండర్ దక్కితే చాలు తాము ఎంతో లక్కీ అనుకుంటారు. అదే ఓకే కుటుంబంలో నాలుగు టెండర్లు దక్కితే ఏమనాలి. కానీ ఇక్కడ తొమ్మిది టెండర్ లు వేస్తే తమ కుటుంబానికే నాలుగు టెండర్లు వచ్చాయి.

Four Wine shop tenders to on family
Four Wine shop tenders to on family

వివరాల్లోకి వెళితే ….మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ క్యాసారం లో ఓకే కుటుంబానికి చెందిన అత్త, ఇద్దరు కోడళ్ళు, వారి ఆడపడుచులు మొత్తం నలుగురు కలిసి తొమ్మిది టెండర్లు వేశారు. కాగా ఈ టెండర్లలో నలుగురికి నాలుగు టెండర్లు దక్కడం ఆశ్చర్యకరం. ఇక కొంపల్లి లోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ లో టెండర్లు తమకే దక్కాయని తెలియడం తో నలుగురు మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బి పోయారు. వారి కుటుంబ సభ్యులు సైతం ఆనందంలో మునిగితేలారు.

Read more RELATED
Recommended to you

Latest news