రేప్ కేసులో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ సిపి ఆనంద్ ఆదేశాలు

-

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వనస్థలిపురంలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాగోతం బట్టబయలైంది. సీఐ నాగేశ్వరరావు ఓ వివాహితతో లాడ్జిలో రాసలీలలు ఆడుతూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయాడు. తన భార్యను సిఐ లాడ్జికి తీసుకెళ్లినట్లు తెలుసుకున్న మహిళ భర్త వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు లాడ్జిలో తనిఖీ చేయగా ప్రియురాలితో సహా పట్టుపడ్డాడు.

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు ప్రశ్నించినందుకు సీఐ తనపై దాడికి పాల్పడ్డారని మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వనస్థలిపురం పోలీసులు ఆయన పై అత్యాచారం, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ని సస్పెండ్ చేస్తూ సి.పి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news