మళ్లీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతామని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల భూముల్ని చంద్రబాబు లాక్కున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్లీనరీలో ‘పరిపాలన- పారదర్శకత’ తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వందల ఎకకరాలను కొల్లగొట్టారని నందిగం సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసిన మోసాలేనని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
ఏ గడప తట్టినా జగన్ నినాదమే మారుమోగుతోందని పేర్ని నాని చెప్పారు. ఏపీ లో జగన్ మోహన్ రెడ్డి హవా నడుస్తోందని.. వైసీపీ పార్టీ ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని వెల్లడించారు. ఎల్లో మీడియా ప్రతిరోజు విషం చిమ్ముతోందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.