ఉప్పల్‌లో భారత్-ఆసీస్ మ్యాచ్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ మహేశ్ భగవత్

-

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. మ్యాచ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని పేర్కొన్నారు.

మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ తదితరులతో కలసి స్టేడియంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. మూడేళ్ల విరామం తరువాత జరగబోయే మ్యాచ్‌ను వీక్షించేందుకు 40 వేల మందికి పైగా వస్తారని అంచనా వేశామని, ఎటువంటి ఇబ్బందులకు చోటివ్వకుండా హెచ్‌సీఏ(హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌)తో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నట్టు సీపీ వివరించారు. గత 20 రోజులుగా స్టేడియంలో వసతులు, గ్యాలరీ తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. స్టేడియం చుట్టూ 15 కి.మీ. పరిధిలో 3000 కెమెరాలతో నిఘా ఉంచామని వెల్లడించారు.

“ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు, రిఫరీలు శనివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి వస్తారు. రెండు హోటళ్లలో బస చేస్తారు. క్రీడాకారులు వచ్చినప్పట్నుంచి మ్యాచ్‌ ముగిసి తిరిగి విమానాశ్రయం వెళ్లేంత వరకూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని” సీపీ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news