షాద్‌నగర్‌లో జరిగిన డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ఘటనపై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న ఓ కేసు వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి మిస్సైనట్లుగా కేసు వచ్చింది. ఉదయం ఓ బ్రిడ్జ్ దగ్గర కాలిపోయిన బాడీ దొరికిందని చెప్పారు. తర్వాత వారి తల్లిదండ్రులు చూశాక ఆమె ప్రియాంకేనని నిర్ధారించారని వెల్లడించారు.
ప్రియాంక తన నక్షత్ర కాలనీలో తన ఇళ్లు నుంచి 5.44 గంటలకు బయలు దేరిందని.. ఆమె టోల్ ప్లాజా వద్దకు సాయంత్రం 6.08 గంటలకు రాగా… ఆమె గచ్చిబౌలి వెళ్లి అక్కడ నుంచి తిరిగి రాత్రి 9 గంటలకు వచ్చిందన్నారు. ఈ కేసులో ఏ 1గా మహ్మద్ అరీఫ్, ఏ 2గా జొల్లు శివ, ఏ 3గా జొల్లు నవీన్, ఏ 4గా చెన్నకేశవులు ఉన్నారు. వీరు తొండుపల్లి వద్ద ప్రియాంక పార్కింగ్ చేస్తున్నప్పుడే గుర్తించారు.
ఆమె గచ్చిబౌలి నుంచి రాత్రి 9 గంటలకు తిరిగి రాగా అంతకు ముందే ఆమె తిరిగి వస్తుందని… ఆమె బైక్ పంచ్చర్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. ప్రియాంక తిరగి వచ్చిన టైంలో మద్యం ఫుల్లుగా తాగిన నిందితులు అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమె టైర్ పంక్చర్ వేస్తామని చెప్పారు. కొంచెం దూరం బైక్ తీసుకు వెళ్లిన వారు పంక్చర్లు వేసే వాళ్లు లేరని చెప్పారు. ఆ వెంటనే ఆమెను టోల్ ప్లాజా సమీపంలోకి బలవంతంగా లాక్కుని వెళ్లారు.
అక్కడే ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె అవరకుండా నోరు గట్టిగా నొక్కిపట్టారు. ఆమెపై అత్యాచారం చేశాక ఆమె గొంతు నొక్కి చంపేశారు. ఆ తర్వాత చెటాన్‌పల్లి వద్ద ఆమె డెడ్ బాడీని పెట్రోల్ పోసి కాల్చివేశారు. ఏ 1గా ఉన్న అరీఫ్ ప్రియాంక నోరు, ముక్కు అదిమిపట్టి హత్య చేశాడు.